ముందస్తు గుర్తింపుతోనే క్యాన్సర్ జయం : డాక్టర్ సచిన్ మర్దా

by Ratna Kumari |

క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రాణాలను రక్షించడంలో మొదటి అడుగు అని యశోద హాస్పిటల్స్ డాక్టర్ సచిన్ మర్ద అన్నారు.

ముందస్తు గుర్తింపుతోనే క్యాన్సర్ జయం :  డాక్టర్ సచిన్ మర్దా
X

దిశ - మహబూబ్ నగర్ : క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రాణాలను రక్షించడంలో మొదటి అడుగు అని యశోద హాస్పిటల్స్ డాక్టర్ సచిన్ మర్ద అన్నారు. తమ 'డిస్కవర్ హెల్త్' సిరీస్‌లో భాగంగా సమగ్ర క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించామని, 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్న తరుణంలో ముందస్తు రోగ నిర్ధారణ ఎంతో కీలకమని ఆయన తెలిపాయి. క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సచిన్ మర్దా మాట్లాడుతూ.. రోబోటిక్ సర్జరీ, టార్గెటెడ్ థెరపీ వంటి అత్యాధునిక సాంకేతికతలతో ఇప్పుడు క్యాన్సర్ భయపడాల్సిన వ్యాధి కాదని స్పష్టం చేశారు. పొగాకు వాడకం, అనారోగ్యకర ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటి రిస్క్ కారకాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అకస్మాత్తుగా బరువు తగ్గడం, అసాధారణ గడ్డలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. యశోద హాస్పిటల్స్ ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ డయాగ్నోస్టిక్స్, ఇమ్యునోథెరపీ వంటి ప్రపంచ స్థాయి చికిత్సలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. సమగ్ర సంరక్షణ ద్వారా రోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Next Story