- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రతిపాదనను రద్దు చేసి రైతులను ఆదుకోండి.. కలెక్టర్ కి వినతి
దిశ, రేవల్లి : గొల్లపల్లి, చీర్కపల్లి గ్రామాలపై స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి ప్రతిపాదించిన రిజర్వాయర్ ను విరమించుకొని రైతులను ఆదుకోవాలని ముంపు బాధితులు గురువారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కు వినతి పత్రం ఇచ్చారు.

దిశ, రేవల్లి : గొల్లపల్లి, చీర్కపల్లి గ్రామాలపై స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి ప్రతిపాదించిన రిజర్వాయర్ ను విరమించుకొని రైతులను ఆదుకోవాలని ముంపు బాధితులు గురువారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఏదుల రిజర్వాయర్ చీర్కపల్లి శివారులోనే ఉంది. మళ్ళీ ఇప్పుడు చీర్కపల్లి, చెన్నారం శివారులోని చెన్నారం, గొల్లపల్లి, కేశంపేట, కేశంపేట తాండ, తల్పునూర్, తల్పునూర్ తాండ, రేవల్లి రైతుల భూములు గొల్లపల్లి రిజర్వాయర్ ఏర్పాటు చేయడంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లుతుందని తెలిపారు. దాదాపు 1200 ఏకరాల పై చిలుకు భూములు కొల్పోయి ముంపునకు గురై రైతులు నిరాశ్రయిలుగా మారే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీనికి ప్రత్యామ్నయంగా గొల్లపల్లి, చీర్కపల్లి గ్రామంలో 100 ఏకరాల భూసేకరణ ద్వారా ఏదుల రిజర్వాయర్ లోని ఆఫ్టిక్ స్ట్రక్చర్ (ఒ.టి) తూము ద్వారా ఏదుల, కోడేరు,గోపాల్ పేట్, వనపర్తి,పానుగల్, మండలాల గ్రామాలకు బుద్దారం బ్రాంచ్ కెనాల్, ఘణప సముద్రం వరకు సాగునీరు అందియవచ్చు. దీని ద్వారా తక్కువ నష్టం వాటిల్లుతుందని తెలిపారు. వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల రైతులకు సరిపడ సాగునీరు అందియ్యవచ్చని తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు రమేష్ యాదవ్, సునీల్, దొడ్ల ఇందిరా రాములు, శేషయ్య నాయకులు తలారి కురుమయ్య, అబ్దుల్ మహమూద్, గడ్డి గోపుల రాములు, మహేష్, విజయ్ మోహన్, జిమ్మి బడ్డయ్య, జెట్టి రాములు, జి కురుమయ్య, మల్లేష్, దవడ రాములు, లక్షమ్మన్, కృష్ణ పాల్గొన్నారు






