- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల కు ఫలితం దక్కాలనే లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలు : ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి
దిశ, మహమ్మదాబాద్/గండీడ్ : గండీడ్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అ

దిశ, మహమ్మదాబాద్/గండీడ్ : గండీడ్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో సర్పంచ్ తో కలిసి ఐమాక్స్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో 5 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పెరటి కోళ్ల పెంపకం, రూ.2లక్షలతో గొర్రెల పెంపకం షెడ్డు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర పొందేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతుల శ్రమకు తగిన ఫలితం దక్కాలనే లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా రైతులకు లాభం చేకూరేలా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మదాబాద్ మండల ఎంపీడీవో నరేందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కమతం విష్ణువర్ధన్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం నారాయణ మాజీ ఎంపీపీ శాంతిమహమ్మదాబాద్ గ్రామ సర్పంచ్ జే. రాంలాల్, గండీడ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. శ్రీనివాస్ రెడ్డి, డీపీఎం అరుణ, ఏపిఎం రవి, ఏపిఎం రజిత, మండల వ్యవసాయ అధికారి రాధమ్మ, ఎఫ్‌పీసీ గండీడ్ అధ్యక్షురాలు మాధవి, గ్రామ సర్పంచ్ ర్యాగరి భగవంత్ రెడ్డి పాల్గొన్నారు.






