- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాళం వేసిన ఇంట్లో తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డ సంఘటన బాలానగర్ మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, జడ్చర్ల : తాళం వేసిన ఇంట్లో తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డ సంఘటన బాలానగర్ మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు, ఎస్సై లెనిన్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కేతిరెడ్డి గ్రామానికి చెందిన కృష్ణయ్య రెండు రోజుల క్రితం తన మనుమరాలు సారీ ఫంక్షన్ కోసం షాద్ నగర్ కి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో 23న అర్థరాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు సమాచారం అందించడంతో హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువాలో దాచి ఉన్న రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, 89 తులాల వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై లెనిన్ గౌడ్ క్లూస్ టీమ్ ను రప్పించి నిందితుల ఆధారాల కోసం అన్వేషించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. ఎవరైనా ఊర్లకు వెళ్లేటప్పుడు తమ విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా మండల పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు.






