- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాగులో కొట్టుకుపోయిన ఎద్దుల బండి.. ఎద్దులు మృతి
దిశ, కోడేరు (కొల్లాపూర్ ): ఓ రైతు దంపతు తమ ఎడ్ల బండి మీద వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా మార్గ మధ్యలో ఉన్న వాగు ఉదృతిగా ప్రవహించింది. దీంతో వాగుదాటలేక ఎడ్ల బండి

దిశ, కోడేరు (కొల్లాపూర్ ): ఓ రైతు దంపతు తమ ఎడ్ల బండి మీద వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా మార్గ మధ్యలో ఉన్న వాగు ఉదృతిగా ప్రవహించింది. దీంతో వాగుదాటలేక ఎడ్ల బండి కొట్టుకుపోయింది. దంపతులు ప్రాణాలతో బయటపడగా.. ఎద్దులు మాత్రం మృతి చెందాయి. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. కోడేరు మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు జక్కుల వెంకటస్వామి, అడివమ్మ తమ ఎడ్ల బండిలో తమ వ్యవసాయ పొలానికి వెళ్తున్నారు. పొలంలో 3 ఎకరాల్లో వరి సాగు చేయగా.. మరో రెండు ఏక రాలు బీడుగా ఉన్న పొలంలో జొన్న సాగు చేసేందు కోసం దుక్కి దున్నుటకు ఆ రైతు దంపతులు ఎడ్ల బండి పై తమ పొలానికి వెళ్తున్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిలో ఉన్న వాగును దాటుతున్న సమయంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎగువ నుంచి వరద ఉదృతంగా వచ్చింది. దీంతో ఎడ్ల బండితో సహా రైతు దంపతులు కొట్టుక పోయారు.
నీటి ఉదృతి కి వాగులో ఉన్న రాళ్లు, జమ్ము గడ్డిని పట్టుకొని ప్రాణాలతో రైతు దంపతులు సురక్షితంగా బయట పడ్డారు. అయితే ఎడ్లు బండికి, ఎద్దుల గొంతుకు తాళ్లు ఉండటంతో ఎడ్లకు తాళ్లు బిగుసుకుపోయి మృతి చెందాయి. ఇక ఈ విషయం నాగులపల్లి గ్రామస్తులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి తాళ్ళు తీసుకుకొని చేరుకున్నారు. వాగు నీటిలో మునిగి పోయిన బండిని, చనిపోయిన ఎడ్లను తాళ్ల తో బయటకి లాగారు. మృత్యువాత పడిన కాడేడ్ల విలువ రూ, 80వేలు ఉంటుందని.. తమకు ఆదుకోవాలని రైతు దంపతులు జక్కుల వెంకట స్వామి, ఆడివమ్మ ప్రభుత్వాన్ని కోరారు.






