- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్ కి గురై ఎద్దు మృతి
దిశ, ఊట్కూర్ : మండల పరిధిలోని కొల్లూర్ గ్రామ శివారులో విద్యుత్ తగిలి ఎద్దు మృతి చెందింది. వి

X
దిశ, ఊట్కూర్ : మండల పరిధిలోని కొల్లూర్ గ్రామ శివారులో విద్యుత్ తగిలి ఎద్దు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని కొల్లూర్ గ్రామానికి చెందిన దండు రాము కొద్ది రోజుల క్రితమే రెండు ఎద్దు లను కొనుగోలు చేశాడు. శుక్రవారం ఎద్దులను మేత కొరకు పొలం దగ్గర విడిచి పెట్టారు. మేత తింటూ అక్కడే ఉన్న ట్రాన్సఫర్ దగ్గరికి ఓ ఎద్దు వెళ్లి విద్యుత్ తగిలి మృతి చెందినట్లు రైతు రాము తెలిపారు. ఎద్దు విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. అధికారులు, రాజకీయ నాయకులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న సర్పంచ్ సువర్ణ, మాజీ సర్పంచ్ సరోజ, కాంగ్రెస్ నాయకులు సమృద్ధి ఆనంద్ రాజ్ విచారణ వ్యక్తం చేశారు.
Next Story






