- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక ఎన్నికల పోరుకు బీఎస్పీ సిద్ధం..!
దిశ, కొల్లాపూర్ : స్థానిక ఎన్నికల్లో బీఎస్పీ బలపరిచిన అభ్యర్థులను ఆదరించాలని బీఎస్పీ కొల్లాపూర్ అసెంబ్లీ అధ్యక్షులు బొల్లి కురుమయ్య ప్రజలను కోరారు. ఆదివారం

దిశ, కొల్లాపూర్ : స్థానిక ఎన్నికల్లో బీఎస్పీ బలపరిచిన అభ్యర్థులను ఆదరించాలని బీఎస్పీ కొల్లాపూర్ అసెంబ్లీ అధ్యక్షులు బొల్లి కురుమయ్య ప్రజలను కోరారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ భవనంలో జరిగిన బీఎస్పీ ముఖ్య నాయకుల సమావేశం లో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక పై చర్చించారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బహుజనుల వ్యతిరేక పార్టీలని.. ఆ పార్టీల ఉచ్చులో పడవద్దని ప్రజలకు ఆయన పిలుపు నిచ్చారు. దొరల పార్టీలలో బహుజనులు గెలిచినా ఆదిపత్యం మాత్రం దొరలదే ఉంటుందన్నారు. మూడు పార్టీలు బహుజన ప్రజలను మోసం చేస్తూ.. కేవలం ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలను అధికారానికి దూరం చేస్తున్నారని కురుమయ్య ఆరోపించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వల్ల ఒరిగేది ఏమీ లేదని, ఈ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే వర్తిస్తాయని, చట్టసభలో అసెంబ్లీ, పార్లమెంటు, ఎన్నికలకు ఏమాత్రం వర్తించవని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత విధానాలను బీసీలు గుర్తించాలని ఆయన గుర్తు చేశారు. చట్టాలు చేయడానికి వీలుకాని 42 శాతం రిజర్వేషన్లతో బీసీలు సంబరపడిపోతున్నారని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసం బీసీలకు అర్థం కావడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. బహుజనులకు ఆత్మ గౌరవం, అధికారం కేవలం బీఎస్పీ తోనే సాధ్యమని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోనాగర్ కర్నూల్ జిల్లా కోశాధికారి దాసు, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అంజి, అసెంబ్లీ కార్యదర్శి జై భీమ్ శంకర్, కొల్లాపూర్ మండల అధ్యక్షుడు బాలకృష్ణ, పెద్ద కొత్తపల్లి మండల అధ్యక్షుడు రామకృష్ణ, ఉపాధ్యక్షురాలు పారిజాత, మధు, సిద్ధార్థ పూలే పాల్గొన్నారు.






