కేటీఆర్ ను కలిసిన బీఆర్ఎస్‌ కౌన్సిల్ సభ్యులు

by Ratna Kumari |

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించిన కార్పొరేటర్లను ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

కేటీఆర్ ను కలిసిన బీఆర్ఎస్‌ కౌన్సిల్ సభ్యులు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించిన కార్పొరేటర్లను ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. బీఆర్ఎస్ బీ పారాలతో గెలిచిన 15 మంది అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన మరో అభ్యర్థి మొత్తం 16 మంది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్పొరేటర్ లను కేటీఆర్ కు పరిచయం చేశారు. నూతనంగా ఎంపికైన సభ్యులను కేటీఆర్ అభినందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం, ప్రలోభాలు, బెదిరింపులను అధిగమించి 16 స్థానాలను దక్కించుకోవడం పట్ల మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను సైతం కేటీఆర్ అభినందించారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూనే.. పెండింగ్ పనుల పూర్తికి, 6 గ్యారంటీ ఇలా అమలకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్ సూచించారు. కష్టపడి పని చేయండి మనకు మంచి ఫలితాలు ఉంటాయ‌ని అన్నారు.

Next Story