ప్రియురాలు పెళ్లి చేసుకోద‌ని ప్రియుడు ఆత్మ‌హ‌త్య

by Ratna Kumari |

ప్రియురాలు పెళ్లి చేసుకోలేద‌ని ప్రియుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని కిరియా తండాలో చోటు చేసుకుంది.

ప్రియురాలు పెళ్లి చేసుకోద‌ని ప్రియుడు ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, వ‌న‌ప‌ర్తి రూర‌ల్ : ప్రియురాలు పెళ్లి చేసుకోలేద‌ని ప్రియుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని కిరియా తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. లావుడ్య గ‌ణేష్(21) హైద‌రాబాద్ లో త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నివాసం ఉంటున్నాడు. అప్పుడ‌ప్పుడు త‌న స్వ‌గ్రామ‌మైన కిరియా తండాకు వ‌చ్చి వెళ్తుండేవాడు. గ‌ణేష్ త‌న బంధువైన అన్నారం తండాకు చెందిన రాత్లావ‌త్ వైశాలిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోదేమోన‌ని.. త‌న ప్రేమ విఫలం చెందుతుంద‌ని మ‌న‌స్థాపానికి గురై మంగ‌ళ‌వారం రాత్రి స‌మ‌యంలో హైద‌రాబాద్ నుంచి ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చాడు. ఇంట్లో ఉరేసుకొని మృతి చెందాడు. గ‌ణేష్ తండ్రి ర‌త్య ఫిర్యాదు మేర‌కు ఎస్సై రిషికేష్ కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు.

Next Story