- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోమశిల టెంపుల్ లో బోర్ డ్రిల్
దిశ, కొల్లాపూర్ : మండల పరిధిలోని సోమశిల పుణ్య క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో సోమవారం బోర్ డ్రిల్ వేశారు. దీంతో మూడు ఇంచులు నీళ్లు పుష్కలంగా పడ్డాయి. సోమశిల

దిశ, కొల్లాపూర్ : మండల పరిధిలోని సోమశిల పుణ్య క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో సోమవారం బోర్ డ్రిల్ వేశారు. దీంతో మూడు ఇంచులు నీళ్లు పుష్కలంగా పడ్డాయి. సోమశిల గ్రామ ప్రజల నీటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మంత్రి జూపల్లి కృష్ణా రావు దృష్టికి గ్రామ నాయకులు, అనుచరులు, గ్రామపంచాయతి తరుపున తీసుకోని వెళ్లారు. మంత్రి వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఎస్డీఎఫ్ (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్) నిధుల నుంచి బోర్ వేయుటకు రూ. 5లక్షలు నిధులను మంజూరు చేశారు. మంత్రి ప్రత్యేక చొరవతో సోమశిల గ్రామంలో కొత్త బోర్ సక్సెస్ అయింది. ఈ బోర్ నీటిని గ్రామంలోని పాఠశాల వద్ద ఉన్న ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కు ఎక్కించి తద్వారా నల్లాలకు నీటిని సరఫరా చేస్తామని సోమశిల గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్య నారాయణ శర్మ తెలిపారు. అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున సహకారం అందించిన మంత్రి జూపల్లి కృష్ణా రావు కు మనస్ఫూర్తిగా గ్రామపంచాయతి తరుపున ధన్యవాదములు తెలిపినట్లు ఆయన వివరించారు.






