- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైకు ను ఢీకొట్టిన బొలెరో వాహనం.. ఇద్దరు మృతి
నాగర్ కర్నూల్ జిల్లాలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

దిశ, పెద్దకొత్తపల్లి : నాగర్ కర్నూల్ జిల్లాలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పెద్ద కొత్తపల్లి మండలం జొన్నలబొగూడ బస్ స్టేజీ సమీపంలో 167 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లాపూర్ వైపు నుంచి హైదరాబాద్ మార్కెట్ కు TS 31,T 5927 నంబర్ గల బొలెరో వాహనంలో మామిడి కాయల లోడ్ అతి వేగంగా వెళ్తున్నది. పెద్ద కొత్తపల్లి నుంచి తమ స్వగ్రామమైన సాతాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి ఆంజనేయులు, ఈశ్వరమ్మ దంపతుల రెండో కుమారుడు కుమ్మరి తేజ (20), అదే గ్రామానికి చెందిన ఆరేపల్లి రాముడు, లక్మి దంపతుల ఏకైక కుమారుడు ఆరేపల్లి ఆంజి (19) తో పాటు తమ స్నేహితుడైన నల్గొండ జిల్లా కు చెందిన ఓ యువకుడి తో కలసి బైక్ పై (ముగ్గురు) సాతాపూర్ వైపు వెళ్తున్నారు.
ఎదురుగా మామిడి కాయల లోడ్ తో అతి వేగంగా వెళ్తూ జొన్నల బొగుడ బస్ స్టేజీ సమీపంలో బైక్ ను ఢీ కొట్టడంతో కుమ్మరి తేజ, ఆరేపల్లి ఆంజి అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. బైక్ దగ్ధమైంది. తమ స్నేహితుడైన నల్గొండ జిల్లా యువకుడు తీవ్ర గాయాలకు గురై పరిస్థితి విషమం గా ఉండడంతో 108 అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రి కి తరలించారు. సాతాపూర్ లో అరెపల్లి ఆంజి తమ కులస్తులు గ్రామ దేవర ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో తన స్నేహితుడిని నల్గొండ జిల్లా నుంచి రప్పించుకోవడంతో వచ్చి ప్రమాదానికి గురయ్యాడు. ఘటన స్థలంలో తమ వారసులు మృత్యువాతపడడం తో తల్లిదండ్రుల కడుపు కోతతో రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. డ్రైవర్ నిర్లక్ష్యం గా అతి వేగంగా బొలెరో వాహనం డ్రైవింగ్ చేసిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో జనం భారీగా గుమికూడారు. సంఘటన స్థలానికి పెద్దకొత్తపల్లి ఎస్సై సతీష్, పోలీసు సిబ్బంది చేరుకున్నారు.మృతుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవాలను పోస్ట్ మార్టం కోసం కొల్లాపూర్ కు పోలీసులు తరలించారు.






