మూడో అమ్మాయి మోక్షిత మృతదేహం ల‌భ్యం

by velandi.Saikiran |

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పెద్ద బోయినపల్లి గ్రామానికి చెందిన గుత్త వెంకటేశ్వర్లు తాను ఆత్మహత్య చేసుకోవ‌డ‌మే గాక చిన

మూడో అమ్మాయి మోక్షిత మృతదేహం ల‌భ్యం
X

దిశ, అచ్చంపేట : ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పెద్ద బోయినపల్లి గ్రామానికి చెందిన గుత్త వెంకటేశ్వర్లు తాను ఆత్మహత్య చేసుకోవ‌డ‌మే గాక చిన్న కూతురు, కొడుకును కాల్చి చంపాడు. అనంతరం పెద్ద కూతురు మోక్షితను కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాండ్ర వద్ద ఉన్న మస్కట్ ఐస్ పార్లర్ సమీపంలో చంపినట్టు కల్వకుర్తి పోలీసులు గురువారం గుర్తించారు.

సిసి ఫుటేజ్ ఆధారంగా మోక్షిత మృతదేహాన్ని గుర్తించారు కల్వకుర్తి పోలీసులు. అనంతరం ఎర్రగొండ పాలెం పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఏపీకి చెందిన వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడిని చంపి తాను వెల్దండ వద్ద ఆత్మహత్య చేసుకోవడం వెనుక బలమైన కారణమే ఉంటుందని చర్చించుకుంటున్నారు.

Next Story