టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ గెలుపు కోస‌మే ప‌ని చేయాలి : BJP

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, హ‌న్వాడ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు తమ కార్యాచరణను

టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ గెలుపు కోస‌మే ప‌ని చేయాలి : BJP
X

దిశ‌, హ‌న్వాడ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు తమ కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హన్వాడ మండల కేంద్రంలో సోమవారం బీజేపీ అధ్యక్షుడు కొండా లింగన్న ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ రూపొందించారు. జ‌డ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, స్థానాల్లో బీజేపీ గెలిచేలా మండల నాయకులకు, కార్యకర్తలకు జిల్లా సీనియర్ నాయకులు పలు సూచనలు చేశారు. టికెట్ ఎవరికి వచ్చిన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని.. టికెట్ రాని వారికి రాబోయే కాలంలో పార్టీ లోసముచిత స్థానం ఇస్తామని బీజేపీ మండల ఇన్చార్జి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కోశాధికారి డా, వెంకటయ్య, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ , మాజీ సర్పంచ్ లు రమణా రెడ్డి, జూక్య నాయక్, రాములు నాయక్, మండల ప్రధాన కార్యదర్శి లు వేణు, రఘురాం గౌడ్, గోపాల్ ,పల్లిమోని మల్లెశ్, కుర్మీ రెడ్డి,హన్మంతు, కార్యదర్శులు రాములు, మహేష్, షక్తికేంద్ర ఇంచర్జులు,బూత్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Next Story