- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైకు ప్రమాదం.. వ్యక్తి మృతి
దిశ, మహమమదాబాద్ : బైకు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మహహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఎస్ఐ

X
దిశ, మహమ్మదాబాద్ : బైకు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మహహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామానికి చెందిన ఈడ్గి శ్రీనివాస్ గౌడ్ (55) ఈనెల 13న తన బైకు పై గాదిర్యాల గ్రామానికి వెళ్తున్నాడు. అయితే నంచర్ల గ్రామ సమీపంలోని మెయిన్ రోడ్డు పై వెనుక నుంచి హన్వాడ మండలం గుడ్డి మల్కాపూర్ గ్రామానికి చెందిన దాసరి యాదయ్య అతివేగంగా బైకు నడుపుతూ వచ్చి శ్రీనివాస్ గౌడ్ ను ఢీ కొట్టాడు. దీంతో శ్రీనివాస్ గౌడ్ తీవ్రగాయాల పాలయ్యాడు. చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం మరణించారు. భార్య మణెమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ శేఖర్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.
Next Story






