భూ భారతి, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలను పరిష్కరించాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

by Ratna Kumari |

దిశ‌, వ‌న‌ప‌ర్తి : భూభారతి, ఇందిరమ్మ ఇళ్ల‌ అమలులో తలెత్తున్న సమస్యలను పరిష్కరించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

భూ భారతి, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలను పరిష్కరించాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
X

దిశ‌, వ‌న‌ప‌ర్తి : భూభారతి, ఇందిరమ్మ ఇళ్ల‌ అమలులో తలెత్తున్న సమస్యలను పరిష్కరించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమం లో పాల్గొన్నారు. ప్రజల ఫిర్యాదులను కలెక్టర్ తో పాటు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయ‌న మాట్లాడుతూ భూ భారతి, ఇందిరమ్మ ఇళ్ల వంటి వాటిలో తలెత్తున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జిల్లా స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రాష్ట్ర స్థాయి లో పరిష్కారమయ్యే సమస్యలను సెక్రటరీ, సదరు శాఖ మంత్రుల దృష్టి కి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. కలెక్టర్ ఛాంబర్ లో ఎమ్మెల్యే కలెక్టర్ ఆదర్శ్ సురభి భేటీ అయ్యారు. నియోజకవర్గం అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు, పురోగతి పై చర్చించారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు యాదయ్య, కీమ్యా నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.

Next Story