ఘనంగా భక్త కనకదాసు జయంతి ఉత్సవాలు

by Ratna Kumari |

దిశ‌, గద్వాల : క‌ర్ణాటక‌ రాష్ట్రంలో పుట్టి గొప్ప భ‌క్తుడిగా, ఆధునిక క‌వి త‌త్వ‌వేత్త‌, సంగీత కారుడిగా, స్వ‌ర‌క‌ర్త‌గా శ్రీభ‌క్త క‌న‌క‌దాసు ముద్ర వేసుకున్నార‌ని

ఘనంగా భక్త కనకదాసు జయంతి ఉత్సవాలు
X

దిశ‌, గద్వాల : క‌ర్ణాటక‌ రాష్ట్రంలో పుట్టి గొప్ప భ‌క్తుడిగా, ఆధునిక క‌వి త‌త్వ‌వేత్త‌, సంగీత కారుడిగా, స్వ‌ర‌క‌ర్త‌గా శ్రీభ‌క్త క‌న‌క‌దాసు ముద్ర వేసుకున్నార‌ని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ అన్నారు. శ్రీ భక్త కనకదాసు జయంతి సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన భక్త కనకదాసు జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై కనకదాసు విగ్రహాలకు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలోని బంకాపుర సమీపంలో బాడు గ్రామంలో బీరప్ప, బీచమ్మ దంపతులకు కురువ కుటుంబంలో జన్మించిన భక్త కనకదాసు శ్రీనివాస ఆచార్యులచే బోధించబడ్డాడని, ఆయన చిన్నతనంలోనే అతను తర్క వ్యాకరణ, "మీ మాంసాలో" నిపుణుడయ్యాడని ఆయన సేవలను కొనియాడారు.

శ్రీ భక్త కనకదాసు చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి కనబరిచి ఆయన కీర్తనలు ఉగాభోగము, కన్నడ భాషల్లో చేసిన రచనలు నేటికి ప్రసిద్ధి చెందాయని తెలిపారు. ముఖ్యంగా ఆయన కవిత్వంతో పాటు సామాజిక సంస్కరణ ఉద్యమాలను కూడా నడిపించారని వివ‌రించారు. కుల వృక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, గట్టు మండలం అధ్యక్షుడు బలరాం నాయుడు, మండల నాయకులు గోపాల్, అడివి ఆంజనేయులు, సుదర్శన్, వీరేష్,విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Next Story