- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శీతాకాలపు పొగమంచు ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి : ఎస్పీ జానకి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : శీతాకాలంలో ఉదయం, రాత్రుళ్ళు పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల రహదారులపై ముందున్న వాహనాలు స్పష్టంగా

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : శీతాకాలంలో ఉదయం, రాత్రుళ్ళు పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల రహదారులపై ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ జానకి సూచించారు. ఈ సందర్భంగా ఆమె వాహనదారులకు పలు సూచనలు చేస్తూ, ద్విచక్ర వాహనదారులు స్పష్టమైన గాజు ఉన్న హెల్మెట్ ధరించాలని, హెడ్ లైట్ లో-బీమ్ లైట్ తో నడపాలని, రిఫ్లెక్టివ్ జాకెట్లు, స్టిక్కర్లు వాడాలని, టర్నింగ్ లో వద్ద ఇండికేటర్స్ వాడాలని సూచించారు. ఫోర్ వీలర్స్ ఫాగ్ లాంప్స్, హెడ్ లైట్స్ లో-బీమ్ లోనే ఉపయోగించాలని, ముందున్న వాహనానికి సురక్షిత దూరం పాటించాలని తెలిపారు. మంచు కురిసి రోడ్డు తడి ఉంటుంది కాబట్టి సడన్ బ్రేకులు వాడకూడదని, టర్నింగ్ అయ్యే ముందు ఇండికేటర్స్ వాడాలని,గ్లౌవ్స్ ధరించాలని, రాత్రుళ్ళు, తెల్లవారుజామున ప్రయాణాలు చేయడం మానుకుంటే మరీ మంచిదని ఎస్పీ జానకి సూచించారు.






