పోకిరీలూ మీ వెనక 'షీ టీమ్' లు నీడలా ఉన్నాయి జాగ్రత్త : ఎస్పీ జానకి

by Ratna Kumari |

మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించడం పోలీస్ శాఖ కర్తవ్యమని, మహిళలు, విద్యార్థినులు, అమ్మాయిలను వేధించే పోకిరీలూ మీ వెనుక 'షీ టీమ్' లు నీడలా ఉన్నాయి జాగ్రత్తగా మసులుకోవాలని ఎస్పీ జానకి హెచ్చరించారు.

పోకిరీలూ మీ వెనక షీ టీమ్ లు నీడలా ఉన్నాయి జాగ్రత్త : ఎస్పీ జానకి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించడం పోలీస్ శాఖ కర్తవ్యమని, మహిళలు, విద్యార్థినులు, అమ్మాయిలను వేధించే పోకిరీలూ మీ వెనుక 'షీ టీమ్' లు నీడలా ఉన్నాయి జాగ్రత్తగా మసులుకోవాలని ఎస్పీ జానకి హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ విద్యాసంస్థలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ, రద్దీ ప్రదేశాలలో 'షీ టీమ్' సిబ్బంది సివిల్ డ్రెస్ లో నిత్యం నిఘా నిర్వహిస్తుంటారని, తప్పు చేశారో తప్పించుకోలేరని ఎస్పీ అల్టిమేటం ఇచ్చారు. జిల్లాలో గత నెలలో మహిళలు, విద్యార్థినిలను వేధిస్తున్న 20 మంది పోకిరీలపై ఫిర్యాదులు అందగా.. అందులో 4 కేసులను కౌన్సిలింగ్ నిర్వహించామని, 14 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చర్యలు తీసుకున్నామని, ఇద్దరి పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు 6 ఈ-పెట్టి కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అలాగే 12 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 70 చోట్ల హట్ స్పాట్ ప్రాంతాలను సందర్శించి నిఘా ఉంచినట్లు ఆమె వివరించారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు, కళాశాలలో షీ టీమ్స్ బృందాలు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, ఫోక్స్ చట్టం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, బాల్య వివాహాల వలన జరిగే దుష్పరిణామాలు, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా వినియోగం, మానవ అక్రమ రవాణా, సెల్ఫ్ డిఫెన్స్, మహిళలు, బాలల రక్షణ చట్టాలు అంశాలపై విద్యార్ధినీ, విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. బాలికలు, విద్యార్ధినీలూ మీపై ఎలాంటి వేధింపులు జరిగినా భయపడకుండా డయల్ 100 కు గానీ, షీ టీమ్ నెంబర్ 8712659365 కు ఫిర్యాదు చేయాలని, నిమిషాల్లో మీకు రక్షణ కల్పిస్తామని ఎస్పీ జానకి భరోసా కల్పించారు.

Next Story