విద్యార్థుల‌కు ఉపాధ్యాయులు ఉత్త‌మ బోధ‌న అందించాలి : విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్

by Ratna Kumari |   (  Updated:2026-02-20 02:30:19  IST  )

పాఠశాల ఉపాధ్యాయుల పని తీరు పై విద్యా శాఖ కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. పని తీరు మెరుగు పరచుకుని ఉత్తమ విద్యా బోధన అందించాలని సూచించారు.

విద్యార్థుల‌కు ఉపాధ్యాయులు ఉత్త‌మ బోధ‌న అందించాలి : విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్
X

దిశ, మిడ్జిల్ : పాఠశాల ఉపాధ్యాయుల పని తీరు పై విద్యా శాఖ కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. పని తీరు మెరుగు పరచుకుని ఉత్తమ విద్యా బోధన అందించాలని సూచించారు. గురువారం మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు దావతులో.. విద్యార్థులు వెట్టిచాకిరిలో అనే కథనం కు స్పందించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల విద్యా బోధన, మధ్యాహ్నం భోజనం తదితర అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా విద్యాధికారి ప్రవీణ్ కుమార్ , స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఉపాధ్యాయుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయుల పనితీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను డీఈవో ప్రవీణ్ కు వివరించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం, మధ్యాహ్న భోజనం వెన్ను ప్రకారం వడ్డించకపోవడం , విద్యాబోధన సరిగా లేకపోవడం , ఉపాధ్యాయులలో సమన్వయ లోపం, ఉపాధ్యాయుల హాజరు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని సూచించారు. ఉపాధ్యాయుల వాగ్వాదం, దాడికి ప్రయత్నించిన విషయంపై ఆరా తీశారు. డీఈవో ప్రవీణ్ కుమార్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని సూచించారు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్ కి కృషి ..

సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో వచ్చే విద్యా సంవత్సరం 100 మండలాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా మిడ్జిల్ మండల కేంద్రం లో కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. విద్యాభివృద్ధికి నిరంతరం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్ ముదిరాజ్, నాయకులు బరిగెల వెంకటయ్య, బాల్ రెడ్డి, సాయిలు, బాలయ్య, బుచ్చయ్య, శ్రీశైలం యాదవ్, రాము గౌడ్, పర్వతాలు, రమేష్, శివ ఉన్నారు.

Next Story