- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దాసర్లపల్లికి బెస్ట్ విలేజ్ అవార్డు
ఉప్పునుంతల మండల పరిధిలోని దాసర్లపల్లి గ్రామానికి ఉపాధి హామీ పథకం కింద “బెస్ట్ విలేజ్ అవార్డు ” లభించింది.

X
దిశ, ఉప్పునుంతల : ఉప్పునుంతల మండల పరిధిలోని దాసర్లపల్లి గ్రామానికి ఉపాధి హామీ పథకం కింద “బెస్ట్ విలేజ్ అవార్డు ” లభించింది. ఈ అవార్డు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు, కూలీలకు ఉపాధి కల్పించడంలో చూపిన కృషికి ప్రతిఫలంగా వచ్చిందని తెలిపారు. ప్రతిరోజూ 100 మందికి పైగా కూలీలను ఉపాధి హామీ పనులకు సమర్థంగా నిర్వహిస్తూ.. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన గ్రామ సర్పంచ్ రమేష్ రెడ్డి, ఉప సర్పంచ్ శంకర్ లతో పాటు ఉపాధి హామీ మేట్ బిజునూరి భూషయ్య సేవలు ప్రశంసనీయమైనవనీ అభినందించారు. ఈ సందర్భంగా గురువారం ఎంపీడీవో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూషయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొన్నగంటి శంకర్, వార్డు సభ్యుడు గోపాలకృష్ణ, ఏపీవో పర్వతాలు పాల్గొన్నారు.
Next Story






