- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పైరవీ కారులను నమ్మి లబ్ధిదారులు మోసపోకూడదు : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
సీఎం సహాయనిధి, కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులకు పైరవీ కారులను నమ్మి లబ్ధిదారులు మోసపోకూడదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు.

దిశ, వనపర్తి : సీఎం సహాయనిధి, కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులకు పైరవీ కారులను నమ్మి లబ్ధిదారులు మోసపోకూడదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. శనివారం ఉదయం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శనివారం క్యాంపు కార్యాలయంలో వనపర్తి పట్టణం, వనపర్తి మండలం, పెబ్బేరు పట్టణం, పెబ్బేరు మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. వనపర్తి మండలం, పట్టణానికి సంబంధించి 36 మంది లబ్ధిదారులకు,పెబ్బేరు పట్టణం, మండలం లబ్ధిదారులకు మంజూరైన 36 చెక్కులను మొత్తం 72 చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదుని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి,వనపర్తి మండలం మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






