బీసీ హాస్టల్లో మౌలిక వసతులే లేవు : రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ యాదవ్

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బీసీ వసతి గృహాంలో విద్యార్థులకు మౌలిక వసతులు లేవని, బీసీ విద్యార్థులను

బీసీ హాస్టల్లో మౌలిక వసతులే లేవు : రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ యాదవ్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బీసీ వసతి గృహాంలో విద్యార్థులకు మౌలిక వసతులు లేవని, బీసీ విద్యార్థులను ప్రభుత్వం చులకనగా చూస్తుందని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బురుగుపల్లి కృష్ణ యాదవ్ ఆరోపించారు. శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బీకె రెడ్డి కాలనీలో ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్న బీసీ బాలుర హాస్టల్ ను సందర్శించి అక్కడి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్న హాస్టల్ భవనంలో 350 మంది విద్యార్థులు ఉన్నారని, 3 గురు ఉండాల్సిన గదిలో పది మంది విద్యార్థులను ఉంచారని, వారికి సరిపడ్డా మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం లాంటి మౌలిక సదుపాయాలు లేవని ఆయన అన్నారు. విద్యార్థులు నిత్యం సమస్యలను ఎదుర్కొంటున్నారని, చాలా మంది విద్యార్థులు తమ గ్రామాలకు వెళిపోతున్నారని ఆయన విచారం వ్యక్తంచేశారు. వెంటనే ప్రభుత్వం బీసీ హాస్టల్ స్వంత భవనాన్ని నిర్మించి వసతులన్నింటినీ కల్పించాలని కోరారు. ఈ సందర్శనలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, నర్సింహులు, నరేందర్, శివాజీ పాల్గొన్నారు.

Next Story