- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ పాత బస్టాండ్ లో మౌళిక వసతులు కల్పించాలి : సీపీఎం పట్టణ కార్యదర్శి పరమేశ్వరాచారి
దిశ, వనపర్తి : ఆర్టీసీ పాత బస్టాండ్ లో మౌళిక వసతులు కల్పించాలని సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శ పరమేశ్వరాచారి డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం పార్టీ వనపర్తి పట్టణ కార్యదర్శి

దిశ, వనపర్తి : ఆర్టీసీ పాత బస్టాండ్ లో మౌళిక వసతులు కల్పించాలని సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శ పరమేశ్వరాచారి డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం పార్టీ వనపర్తి పట్టణ కార్యదర్శి ఆధ్వర్యంలో సీపీఎం పార్టీ నాయకులు ఆర్టీసీ డిపో ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు కు పాత బస్టాండ్ లో మౌళిక వసతులు కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న పాత బస్టాండ్ ను తాత్కాలికంగా వినియోగంలోకి తెవడం సంతోషకరమన్నారు. బస్సు స్టాండ్ స్థలం సీసీ వేయించాలని, డ్రైనేజీ సమస్య ను పరిష్కరించాలని, ప్రయాణికులకు మరుగుదొడ్లు,త్రాగునీరు, విధ్యుత్ కూర్చునే ఏర్పాట్లు,సౌకార్యాలు కల్పించాలని కోరారు. గత కొద్ది సంవత్సరాలుగా పాత బస్టాండ్ ముందు పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం గడిపే వారికి షట్టర్లతో డబ్బాలు ఏర్పాటు చేసి కిరాయికి ఇవ్వాలని, బస్టాండ్ స్థలం ను అన్యాక్రాంతం కాకుండా పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోవాలని సీపీఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు గంధంగట్టయ్య, గంధంమదన్, జి. బాలస్వామి రమేష్, నందిమల్ల రాములు, బీసన్న పాల్గొన్నారు.






