పరిశుభ్రతే వికసిత భారతానికి పునాది: బాలా త్రిపుర సుందరి

by Kodari Anjali |

స్వచ్ఛమైన గ్రామాలతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఆర్. బాలా త్రిపుర సుందరి అన్నారు.

పరిశుభ్రతే వికసిత భారతానికి పునాది: బాలా త్రిపుర సుందరి
X

దిశ, మిడ్జిల్: "స్వచ్ఛమైన గ్రామాలతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని, పరిశుభ్రతే వికసిత భారతానికి పునాది" అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఆర్. బాలా త్రిపుర సుందరి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలనను పురస్కరించుకుని సోమవారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి గ్రామాల్లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాలలో ఆమె పాల్గొని మాట్లాడారు. "ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ ద్వారా దేశానికి కొత్త దిశ చూపారని, ప్రజలతో కలిసి పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ సమాజ సేవలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ప్రతి పౌరుడు పరిశుభ్రతను తన వ్యక్తిగత బాధ్యతగా భావించాలని, వీధి, గ్రామం శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన భారతం నిర్మించగలమని బాలా త్రిపుర సుందరి ఉద్బోధించారు. గ్రామస్తులతో కలిసి ఆమె పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తిరుపతి, మిడ్జిల్ మండల బీజేపీ అధ్యక్షుడు నరేష్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story