పవిత్ర త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ

by Ratna Kumari |

బక్రీద్ పండుగ త్యాగానికి, ప్రేమకు, మానవత్వానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పర్వదినమని ఎస్పీ జానకి పేర్కొన్నారు.

పవిత్ర త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బక్రీద్ పండుగ త్యాగానికి, ప్రేమకు, మానవత్వానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పర్వదినమని ఎస్పీ జానకి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా ఎస్పీ కార్యాలయంలో ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడారు. ప్రజలంతా పరస్పరం మతాలను గౌరవించుకుంటూ సోదరభావంతో పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు, ఈద్గాలు, మసీదులు, ప్రార్థనా స్థలాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712659360 లేదా డయల్ 100 ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ జానకి సూచించారు.

Next Story