ఐక్యతకు చిహ్నం బక్రీద్ పండుగ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Ratna Kumari |

ఐక్యతకు చిహ్నం బక్రీద్ పండుగ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ఐక్యతకు చిహ్నం బక్రీద్ పండుగ :  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: ఐక్యతకు చిహ్నం బక్రీద్ పండుగ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా న్యూ గంజ్, రహమానియా ఈద్గా, మయూరి పార్కు వద్ద గల హైలే హద్దీస్ దర్గా ల దగ్గర జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో ఆయన పాల్గొని, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. బక్రీద్ పండుగ త్యాగం, దానధర్మాలు, నిస్వార్థ సేవకు ప్రతీక అని, ఈ పర్వదినం మనలో సేవాభావం పరస్పర సహకారం వంటి విలువలతో కులమతాలకు అతీతంగా స్నేహపూర్వకంగా సహనంతో జీవిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, సిరాజ్ ఖాద్రీ, షబ్బీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, పాల్గొన్నారు.

Next Story