మహిళల భద్రత, రక్షణ చట్టం పై అవగాహన సదస్సు

by velandi.Saikiran |   (  Updated:2026-02-03 19:25:11  IST  )

మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ నందు నేడు ఐసిఎఫ్ఐ లా స్కూల్ ఐఎఫ్ హెచ్ ఈ,హైదరాబాద్‌లోని లీగల్ ఎయిడ్ సొసైటీ 2026 మంగళవారం మహిళల భద్రత,రక్షణ అంశంపై లీగల్ అవగాహన, జనసున్వాయి కార్యక్రమాన్ని నిర్వహించింది.

మహిళల భద్రత, రక్షణ చట్టం పై అవగాహన సదస్సు
X

దిశ, గోపాల్ పేట: మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ నందు నేడు ఐసిఎఫ్ఐ లా స్కూల్ ఐఎఫ్ హెచ్ ఈ,హైదరాబాద్‌లోని లీగల్ ఎయిడ్ సొసైటీ 2026 మంగళవారం మహిళల భద్రత,రక్షణ అంశంపై లీగల్ అవగాహన, జనసున్వాయి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం గోపాల్‌పేట్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ రజిని, మాట్లాడుతూ మహిళల చట్టాల గురించి వరకట్నం వేధింపు గురించి బాల్య వివాహాల గురించి పలు సూచనలు చేయడం జరిగింది.,అలాగే డా. ఆయేషా అంజుమ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీ ఓ), గోపాల్‌పేట్ మండలం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మహిళా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.గౌరవ న్యాయమూర్తి మహిళలకు సంబంధించిన సంవిధాన పరిరక్షణలు,కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నివారణ,పి సి పి ఎన్ డి టి చట్టం, అలాగే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు.ఉచిత న్యాయ సహాయం కోసం 08543-2202250 నంబర్‌ లేదా టోల్‌ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించవచ్చని తెలియజేశారు.అనంతరం, లీగల్ ఎయిడ్ సభ్యులు వరకట్న వేధింపులు మరియు వరకట్న మరణాలపై చట్టపరమైన రక్షణలు, అలాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (112), మహిళా హెల్ప్‌లైన్ (181) మరియు వన్ స్టాప్ సెంటర్లు (ఓ ఎస్ సి) ఎలా వినియోగించుకోవాలో వివరించే విస్తృతమైన పోస్టర్ ప్రజెంటేషన్ను అందించారు.ఈ కార్యక్రమంలో ఎస్. కన్నన్, దిలీప్ శర్మ,గీత ప్రియదర్శిని, రాకేష్ సూర్యదేవర,లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు,పారా లీగల్ వాలంటరీ బంకల రవీందర్ పాల్గొన్నారు.

Next Story