జేపీఎన్సీఈ కళాశాలకు 'ఉత్తమ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల' అవార్డు

by Nallavelli.Anjaneyulu |

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల కు రాష్ట్రంలోనే 'బెస్ట్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్' గా అవార్డు లభించింది.

జేపీఎన్సీఈ కళాశాలకు ఉత్తమ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల అవార్డు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల కు రాష్ట్రంలోనే 'బెస్ట్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్' గా అవార్డు లభించింది. శనివారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర కేబినెట్ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ అవార్డును కళాశాల చైర్మన్ కే.ఎస్ రవికుమార్ కు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, ఆచార్యులు, ఇంజినీర్లు చైర్మన్ కెఎస్ రవికుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story