బ‌స్టాండ్ లో వెండి క‌డియాల‌ చోరీకి య‌త్నం.. పోలీసుల‌కు అప్ప‌గించిన ప్ర‌యాణికులు

by Ratna Kumari |

దిశ, గద్వాల క్రైం : గద్వాల ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం మధ్యాహ్నం చోరీ యత్నం కలకలం రేపింది. బస్సులో ఎక్కేందుకు వేచి ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలి చేతికి ఉన్న వెండి కడియాలను చోరీ చేయడానికి

బ‌స్టాండ్ లో వెండి క‌డియాల‌ చోరీకి య‌త్నం.. పోలీసుల‌కు అప్ప‌గించిన ప్ర‌యాణికులు
X

దిశ, గద్వాల క్రైం : గద్వాల ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం మధ్యాహ్నం చోరీ యత్నం కలకలం రేపింది. బస్సులో ఎక్కేందుకు వేచి ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలి చేతికి ఉన్న వెండి కడియాలను చోరీ చేయడానికి ప్రయత్నించిన మరో మహిళను అప్రమత్తంగా ఉన్న ఇతర ప్రయాణికులు పట్టుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం.. ఆ మహిళ క్రమంగా బస్సు రద్దీని ఉపయోగించుకుని కడియాలను దొంగిలించే ప్రయత్నం చేసింది. అయితే బాధితురాలు ఆ మహిళా దొంగను గమనించడంతో ఆమెను అక్కడే నిలువరించారు. ఇతర ప్రయాణికులు ముందుకు వచ్చి ఆ మహిళను అదుపులోకి తీసుకుని వెంటనే గద్వాల పట్టణ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ మహిళను స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ప్రారంభ దర్యాప్తులో ఆమె ఇంతకుముందు కూడా ఇలాంటి చోరీలలో పాలుపంచుకున్నట్టు అనుమానిస్తున్నారు. బస్టాండ్‌లలో రద్దీగా ఉండే ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story