- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎఫ్‌ఐఆర్ కాపీ అడిగితే బాధితురాలిపై దాడి!
అత్యాచారానికి గురైన ఓ వివాహిత న్యాయం కోరుతూ ఎఫ్‌ఐఆర్ నకల్ కాపీ ఇవ్వాలని అడిగినందుకే మహిళా పోలీస్ అధికారి కొట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన వీపనగండ్ల పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది.

దిశ, వీపనగండ్ల : అత్యాచారానికి గురైన ఓ వివాహిత న్యాయం కోరుతూ ఎఫ్‌ఐఆర్ నకల్ కాపీ ఇవ్వాలని అడిగినందుకే మహిళా పోలీస్ అధికారి కొట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన వీపనగండ్ల పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. దీనిపై బాధితురాలు యోగేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సంఘటన పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది. బాధితురాలి కథనం ప్రకారం.. వీపనగండ్ల గ్రామానికి చెందిన యోగేశ్వరి గత సంవత్సరం జూన్ 2, 2025న కొల్లాపూర్ మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన గడ్డం బాలకృష్ణ అనే వ్యక్తి తనపై అత్యాచారం చేసి పరారైనట్లు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, ఏడు నెలలు గడిచినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం, కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం అన్యాయమని ఆమె వాపోయారు.కేసు స్థితిగతులు తెలుసుకునేందుకు, చట్టబద్ధంగా తనకు రావాల్సిన ఎఫ్‌ఐఆర్ నకల్ కాపీ ఇవ్వాలని ఎస్సై కె. రాణిని పలుమార్లు కోరినా పట్టించుకోలేదని తెలిపారు. దీంతో జనవరి 05, 2026 వనపర్తి సీఐ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లగా.. “ఎస్సై దగ్గరకే వెళ్లి తీసుకో” అంటూ తిరిగి పంపించారని చెప్పారు. అదే రోజు సాయంత్రం సమయంలో వీపనగండ్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సై ని మరోసారి ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వాలని అడగ్గా.. ఆమె తన ఫోన్‌ను లాక్కొని, దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురి చేసిందని బాధితురాలు ఆరోపించారు. అంతేకాకుండా కల్వరాల కు చెందిన మహేందర్ అనే వ్యక్తిపై కేసు పెట్టాలని ఒత్తిడి చేస్తూ బెదిరించారని తెలిపారు. తనపై అత్యాచారం చేసిన అసలు నిందితుడైన గడ్డం బాలకృష్ణను కాపాడేందుకే తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారని, అందుకు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్‌లోనే తనను చితకబాదారని యోగేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. మహిళలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్‌లోనే తనకు భద్రత లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తనను కొట్టి మానసికంగా వేధించిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు.
ప్రాథమిక విచారణలో తప్పు జరగలేదు : ఎస్సై రాణి
అత్యాచారం జరిగిందని ఫిర్యాదులో విచారణ చేపట్టగా.. వాస్తవం లేదనే కారణంతో కేసు నమోదు చేయలేదు. వారం రోజుల తర్వాత బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వచ్చి తాను ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకుంటున్నట్టు మరో ఫిర్యాదు ఇవ్వడంతో ఎలాంటి కేసు చేయలేదు. బాధితురాలు చేస్తున్నా ఆరోపణలు తప్పు అన్నారు. ఉన్నతాధికారుల విచారణలో నిజానిజాలు తెలుస్తాయని ఎస్సై రాణి తెలిపారు.






