ఆల‌య పూజారి పై దాడి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, బిజినేప‌ల్లి : ఆలయ పూజారి పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం, పాలెం

ఆల‌య పూజారి పై దాడి
X

దిశ‌, బిజినేప‌ల్లి : ఆలయ పూజారి పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం, పాలెం గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో గురువారం చోటు చేసుకుంది. ఆలయ పూజారి వెల్డండ సురేష్ శర్మ బిజినేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఇవాళ ఉదయం 10 గంటలకు అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి ఈ గుడి స్థలం నాది ఇక్కడ గుడి కట్టి పూజ చేయ‌డానికి మీరెవరు..? ల **కొడుక నీవు అంటూ పక్కనే ఉన్న చాటగోపురం తో ముఖం పై ఛాతి పై కొట్టారని ఫిర్యాదులో తెలిపారు. విషయం తెలుసుకున్న విష‌యం తెలుసుకున్న నాగ‌ర్ క‌ర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాడికి గల కారణాలు తెలుసుకున్నారు. ఈ విషయం పై పోలీసులు పూర్తి విచారణ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Next Story