- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై దాడి.. ప్రజాస్వామ్య లౌకిక విలువపై దాడే : సీపీఎం
దిశ, వనపర్తి టౌన్ : సుప్రీం కోర్టు న్యాయమూర్తి పై జరిగిన దాడి ప్రజాస్వామ్య లౌకిక విలువల గల రాజ్యాంగం పై దాడిగా సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పేర్కొన్నారు. శనివారం

దిశ, వనపర్తి టౌన్ : సుప్రీం కోర్టు న్యాయమూర్తి పై జరిగిన దాడి ప్రజాస్వామ్య లౌకిక విలువల గల రాజ్యాంగం పై దాడిగా సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పేర్కొన్నారు. శనివారం వనపర్తి పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో సీపీఎం పట్టణ కమిటీ సుప్రీం కోర్టు న్యాయమూర్తిపై దాడికి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ సుప్రీం కోర్టులో న్యాయవాది రాకేష్ కిషోర్, జస్టిస్ గవాయి పై బూటు విసరడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ చర్యకు పాల్పడ్డ న్యాయవాది పై చర్య తీసుకొని పక్షంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు డి. కురుమయ్య, గందం మదన్, జి, బాలస్వామి, ఏ. రమేష్, ఏం. మన్యం, జి రాబర్ట్, రత్నయ్య, సాయి లీల, ఈ. పురుషోత్తం, సి. పుల్లయ్య, భాస్కర్, బి. కురుమయ్య, మద్దిలేటి పాల్గొన్నారు.






