- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోరక్ష చట్టాలు అమలు చేయాలని ఎస్సై కి వినతి
బక్రిద్ సందర్భంగా పకడ్బందీగా గోరక్ష చట్టాలు కఠినంగా అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సోమవారం సీఐ రాంలాల్, ఎస్సై భాగ్యలక్ష్మీ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు.

దిశ, మక్తల్ : బక్రిద్ సందర్భంగా పకడ్బందీగా గోరక్ష చట్టాలు కఠినంగా అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సోమవారం సీఐ రాంలాల్, ఎస్సై భాగ్యలక్ష్మీ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు.వేదకాలం నుంచి దేవతా స్వరూపంగా వేదకాలంగా నుంచి గోవును ఆరాధ్య దేవతగా పూజిస్తామని.. బక్రిద్ పండుగ సందర్భంగా గోవధ రెట్టింపు స్థాయిలో జరుగుతోంది. హిందూ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని.. చట్టానని అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చేష్టలు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టితో మొదలుకొని పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయంతో పాటు మానవాళి ఆరోగ్య రక్షణకు గోమాత ఆధారం.
గోవులను ప్రస్తుతం విచ్ఛలవిడిగా వధించి మాంసాహారంగా ఉపయోగించుకుంటూ వేల టన్నుల గోమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని పేర్కొన్నారు. గోవులను కాపాడాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1977లో చట్టం తెచ్చింది. ప్రస్తుతం చట్టవిరుద్ధంగా రాష్ట్రంలో విచ్ఛలవిడిగా గోవధ జరుగుతున్న చట్టాన్ని అమలు చేయాల్సిన యంత్రాంగం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఇప్పటికైనా గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలుకు తగు చర్యలు తీసుకోవాలని 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పోలీసులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ భాస్కర్ రెడ్డి, కార్యదర్శి మల్లి కార్జున రావు, జుట్ల హన్మంత్, బజరంగ్ దళ్ కో కన్వీనర్ భీమేష్, సంయోజక్ రాహుల్, గోరక్ష సంయోజక్ అనిల్ శివ, లింగం రమేష్, నరేష్, శంకర్, రామాంజనేయులు, నవీన్ బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.






