- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆశాల ధర్నా
దిశ, పాన్ గల్ : ఆశా కార్యకర్తల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీఐటీయూ

దిశ, పాన్ గల్ : ఆశా కార్యకర్తల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా జిల్లా సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము మాట్లాడుతూ చాలీ చాలని వేతనంతో విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తల వేతనాలు చెల్లించాలని పిక్స్ డ్ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న లెప్రసీ పల్స్ పోలియో ఎన్నికల డ్యూటీ డబ్బులు, నేటికీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఆశలకి 18,000 ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలని నెరవేర్చకుంటే రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని నడి రోడ్డుపై నిలదీస్తామని హెచ్చరించారు. ఆశాల సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 27న చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27 లోపు ఆశాల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగం స్పందించాలని లేదంటే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కొనసాగుతుందని హెచ్చరించారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో జిల్లా ఆశా వర్కర్లందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ జిల్లా నాయకురాలు మహేశ్వరి, శ్యామలమ్మ, సుజాత, లలిత, లక్ష్మి, ప్ర మీల, రామేశ్వరమ్మ, రమాదేవి, కవిత భాగ్యమ్మ, లక్ష్మి, సుజాత, సంధ్య సునీత,రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్, కేవీపీఎస్ జిల్లా నాయకులు భీమయ్య, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కమలాకర్ పాల్గొన్నారు.






