- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని స్థాపిస్తాం : అవోపా
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని స్థాపించడానికి కృషి చేస్తున్నట్లు జిల్లా 'అవోపా'(ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని స్థాపించడానికి కృషి చేస్తున్నట్లు జిల్లా 'అవోపా'(ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్) అధ్యక్ష,కార్యదర్శులు పాపిశెట్టి, మురళీకృష్ణ లు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అవోపా భవనంలో అధ్యక్షుడు పాపిశెట్టి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వారు ప్రసంగించారు. విద్య , సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, అవసరంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేస్తున్నామని, జిల్లా అవోపా సూచనల మేరకు విద్యార్థులకు క్రీడా పోటీలు, ప్రతిభా అవార్డులు ఇస్తున్నామని తెలిపారు. వచ్చే డిసెంబర్ మాసంలో ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేయనున్నట్లు, అంతేకాక పేద ఆర్యవైశ్య వధూవరులకు ఉచిత వివాహాలు చేయడానికి కూడా సిద్దమైనట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భాస్కర్, కోశాధికారి నర్సింహులు పాల్గొన్నారు.






