ధాన్యం తరలించేందుకు వాహనాల ఏర్పాటు చేయండి : రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ

by Ratna Kumari |

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు అవసరమైన లారీలు ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జే.ఎల్. బి. హరిప్రియ ఆదేశించారు.

ధాన్యం తరలించేందుకు వాహనాల ఏర్పాటు చేయండి :  రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీ ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు అవసరమైన లారీలు ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జే.ఎల్. బి. హరిప్రియ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని ఆమె తన ఛాంబర్ లో ధాన్యం రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. భారీగా ధాన్యం వచ్చిన పీపీసీ ల వద్ద అదనపు లారీలను ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల స్థానిక ట్రాక్టర్లను వినియోగించాలని, అకస్మాత్తుగా కురిసే వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ధాన్యం నష్టపోకుండా ఉండేందుకు, పీపీసీ లలో ఉన్న ధాన్యం నిల్వలను వెంటనే మిల్లులకు తరలించాలని, అన్ని కాంట్రాక్టర్లను యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల సంస్థ డిఎం రవి నాయక్ పాల్గొన్నారు.

Next Story