సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడమే 'అరవై అలైవ్స‌ ఉద్దేశం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Ratna Kumari |

రోడ్డు భద్రత పాటిస్తూ ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవడమే 'అరవై అలైవ్' ఉద్దేశ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడమే అరవై అలైవ్స‌ ఉద్దేశం :  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రోడ్డు భద్రత పాటిస్తూ ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవడమే 'అరవై అలైవ్' ఉద్దేశ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 13 నుంచి 18 వరకు రోడ్డు భద్రత పై నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎస్పీ జానకి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మేయర్ మమత, అదనపు కలెక్టర్లు హారిప్రియ, మధుసూదన్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మెన్ బెక్కెరి అనిత, ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహారెడ్డి, డిఫ్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి రఘు కుమార్, టూ టవున్ సీఐ ఇజాజొద్ధీన్ తదితరులు రోడ్డు భద్రత పాటించడం పై ప్రతిజ్ఞ చేశారు.

Next Story