60 ఏళ్ల వృద్ధుడి వెకిలి చేష్టలు.. రూ. 500 నోటు ఆశ చూపి తన కోరిక తీర్చమని బాలికకు వేధింపులు..

by Disha Web Desk 11 |
60 ఏళ్ల వృద్ధుడి వెకిలి చేష్టలు.. రూ. 500 నోటు ఆశ చూపి తన కోరిక తీర్చమని బాలికకు వేధింపులు..
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: తన తల్లిదండ్రులు నిర్వహించే సర్కస్ లో తన వంతు పాత్రను పోషిస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న ఓ బాలికకు రూ. 500 నోటు చూపి, అశ్లీల మాటలు మాట్లాడి తన కోరిక తీర్చాలంటూ 60 ఏళ్ల వృద్ధుడు ఓ బాలికను వేధింపులకు గురి చేసిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు తమ ఇద్దరు కూతుళ్లతో ఊరు తిరుగుతూ జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూరు గ్రామంలో సర్కస్ ప్రదర్శన పూర్తి అయిన తర్వాత గుడారంలో అక్కడే ఉంటున్నారు. శనివారం సాయంత్రం గుడారానికి కొంత దూరంలో ఉన్న ఆ బాలిక వద్దకు 60 ఏళ్ల ఓ వృద్ధుడు వచ్చి, 500 రూపాయల నోటు చూపుతూ వెకిలి చేష్టలు చేస్తూ, అసభ్యకర మాటలు మాట్లాడడంతో ఆ బాలిక ఏడుస్తూ జరిగిన సంఘటన గురించి తన తల్లికి వివరించింది.

తల్లి ఆ వృద్ధుని వద్దకు వెళ్లి గట్టిగా నిలదీసింది. అనంతరం గ్రామ పెద్దలకు తెలియజేసింది. కానీ గ్రామ పెద్దలు విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడి సర్ది చెప్పే ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. సామాజిక మాధ్యమాలలో సైతం జరిగిన సంఘటన గురించి ప్రచారం జరిగింది. బాధిత బాలిక జరిగిన సంఘటనను గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మరిన్ని వివరాలు సేకరించి కేసు నమోదు చేసేందుకు ఎస్ఐ బాలరాజు చర్యలు తీసుకుంటున్నారు.


Next Story