- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంజన్న తిరునాళ్లు నెలరోజులే.. పనుల్లో వేగవంతం పెంచండి : మంత్రి వాకిటి శ్రీహరి
దిశ, మక్తల్ : పురాతనమైన పడమటి ఆంజనేయస్వామి కోనేరు పునరుద్ధరణ పనులను వాకిటి శ్రీహరి ఆదివారం పరిశీలించారు. డిసెంబర్ 04న పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం

దిశ, మక్తల్ : పురాతనమైన పడమటి ఆంజనేయస్వామి కోనేరు పునరుద్ధరణ పనులను మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం పరిశీలించారు. డిసెంబర్ 04న పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం ఉంటుందిన అందుకు పనుల్లో వేగవంతం పెంచాలని అక్కడ పనిచేస్తున్న వారిని ఎండోమెంట్ అధికారిని ఆదేశించారు. కొన్ని శాసనాల ప్రకారం.. మక్తల్ పట్టణానికి దాదాపు 800 సంవత్సరాల క్రితం నుంచి మక్తల్ యజ్ఞ స్థలంగా పేరుగా వైభవంగా వెలిగిందని పట్టణానికి నలువైపులా కోనేరులతో దివ్యంగా వెలుగొందని నీటి గురించి భావితర తరాల వారికి చెప్పేవారు లేక మక్తల్ లో పురాతనమైన దేవాలయాలు, కోనేర్ల విశిష్టత చరిత్ర అడుగడుగునా దేవాలయాలతో విల్లసిల్లిన నేటి మక్తల్ చరిత్ర గురించి ముందు తరాల వారికి చెప్పే వారు లేక మరుగున పడిపోయిందన్నారు. కనీసం ఈతరం వారైన భావితరాల వారికి మక్తల్ విశిష్టత అందించే ఉద్దేశంతో నడుం కట్టామని తెలిపారు.
అందుకు అఖిల పక్ష నాయకుల సహాకారంతో సాధ్యం అవుతుందని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. పడమటి అంజన్న కోనేరు అతి సుందరంగా సువిశాలంగా రాతికట్టడం తీర్చిదిద్దిన మెట్లతో ఉన్న కోనేరును ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల స్థానిక పాలకులు పట్టించుకోకపోవడం వల్ల కోనేరు చెత్త కుండీగా మార్చారని ఆవేదన వ్యక్తం చేసారు.గతంలో అంజన్న భక్తుల శుభ్రతకు, అవసరాలకు కోనేటి నీటిని వాడేవారని మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. పూడుకుపోయిన మట్టిని, ముళ్లకంప, చెట్లను తొలగించారు. కోనేటి స్థలాన్ని ఆక్రమించుకున్న నివాసులతో చర్చించి ఇచ్చేలా మంత్రి కృషి చేశారు. 10 ఫీట్ల వెడల్పు స్థలం సేకరించి అందంగా రేలింగ్ తయారు చేయడంతో పాటు లైటింగ్, షవర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. డిసెంబర్ లో జరిగే తిరునాళ్లకు కోనేటిని భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.






