ఎర్రశేఖర్ కు అనిరుద్ రెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి

by Ratna Kumari |

దిశ, జడ్చర్ల : జడ్చర్ల నియోజకవర్గానికి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పై ప్రస్తుత ఎమ్మెల్యే

ఎర్రశేఖర్ కు అనిరుద్ రెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల నియోజకవర్గానికి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పై ప్రస్తుత ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేయడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎర్రశేఖర్ పబ్బండ వర్గాల ఆశాజ్యోతి అని, ఎలాంటి మచ్చలేని నాయకుడని, ఆజాతశత్రువుగా పేరుగాంచినవాడని, అలాంటి గొప్ప ప్రజా నేతను ఫ్యాక్షనిస్టుగా అభివర్ణిస్తూ అగ్రకుల అహంకారంతో అనిరుద్ రెడ్డి ఆరోపణలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని జడ్చర్ల కు చెందిన పలు ప్రజా సంఘాల నాయకులు అన్నారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ కళాభవన్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ఈ విలేఖరుల సమావేశంలో బీసీ జాగృతి సేన అధ్యక్షుడు బి.కృష్ణ యాదవ్, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు బి. నర్సింహులు ముదిరాజ్, LHP S నాయకుడు సి.రవి నాయక్ లు మాట్లాడారు. ఎర్ర శేఖర్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా ప్రజాసేవ చేశారని, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నడూ కూడా ఫ్యాక్షనిస్టుగా వ్యవహరించలేదని భూకబ్జాలకు, హత్యా రాజకీయాలకు పాల్పడలేదని, అలాంటి ఉత్తమ వ్యక్తి నుండి తనకు ప్రాణహాని ఉంటుందని అనిరుద్ రెడ్డి పేర్కొనడం శోచనీయంగా ఉందని వారన్నారు. నియోజకవర్గంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ఎర్రశేఖర్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే భయంతోనే, ఆయనను పార్టీలోకి రాకుండా ఎమ్మెల్యే అడ్డుకట్ట వేస్తున్నారని వారు విమర్శించారు. ప్రస్తుతం దేశంలో ఉన్నది రాచరిక వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్య దేశంలో ఇష్టం వచ్చిన పార్టీలో చేరే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని వారు అన్నారు. ఇష్టానుసారంగా అసత్య ఆరోపణలు చేసిన అనిరుద్ రెడ్డి వెంటనే తన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, అలాగే మీడియా ముఖంగా ఎర్ర శేఖర్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో చారి, నిరంజన్, నర్సింగ్, అనిల్, వెంకటేష్, పర్శవేది, గుండు వెంకటేష్, సత్యం పాల్గొన్నారు.

Next Story