గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ.. యువ‌కుడికి గాయాలు

by Ratna Kumari |

దిశ‌, మిడ్జిల్ : గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొట్ట‌డంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని రాణి పేట గ్రామంలో చోటుచేసుకుంది.

గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ.. యువ‌కుడికి గాయాలు
X

దిశ‌, మిడ్జిల్ : గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొట్ట‌డంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని రాణి పేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికల వివరాల ప్రకారం.. దోనూర్ గ్రామానికి చెందిన మ‌హేష్ గౌడ్ జ‌డ్చ‌ర్ల నుంచి త‌న స్వ‌గ్రామానికి వెళ్తుండ‌గా.. రాణిపేట గ్రామం వ‌ద్ద గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొట్టింది. దీంతో మ‌హేష్ గౌడ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈ ప్ర‌మాదంలో కాలు విరిగినట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో ఎస్పీ ర‌త్నం మిడ్జిల్ వైపు వెళ్తుండ‌గా.. ప్ర‌మాద సంఘ‌ట‌న‌ను ప‌రిశీలించి గాయ‌ప‌డిన యువ‌కుడిని 108 వాహ‌నంలో జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Next Story