కానిస్టేబుల్ శ్రావ‌ణి త‌ల్లిదండ్రుల‌కు రూ.5ల‌క్ష‌ల బీమా చెక్కు అంద‌జేత

by Ratna Kumari |

దిశ, గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుల్ శ్రావణి గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందింది. ఈ

కానిస్టేబుల్ శ్రావ‌ణి త‌ల్లిదండ్రుల‌కు రూ.5ల‌క్ష‌ల బీమా చెక్కు అంద‌జేత
X

దిశ, గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ శాఖకు చెందిన కానిస్టేబుల్ శ్రావణి గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందింది. ఈ నేపథ్యంలో, ఆమె కుటుంబానికి రూ.5,00,000 విలువైన భీమా చెక్కును ఆమె త‌ల్లిదండ్రుల‌కు ఎస్పీ టి. శ్రీనివాసరావు అందజేశారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ నుంచి ఇంతకు ముందు రూ.10 లక్షల భీమా అందజేయగా.. ప్ర‌స్తుతం చీఫ్ ఆఫీస్ వెల్ఫేర్ గ్రూప్ పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ పరిధిలో శ్రావణి తల్లిదండ్రులు ఇంద్రమ్మ, ఈశ్వరయ్యలకు రూ.5 లక్షల చెక్కు ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ ఆర్థిక స‌హాయం కుటుంబానికి కొంత భ‌రోసా ఇస్తుంద‌ని.. పోలీస్ శాఖ త‌మ సిబ్బంది కుటుంబాల‌కు అండ‌గా ఉంటుందని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ స‌తీష్ కుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ బి. నాగమణి, సీనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మి, శ్రావణి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story