- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా యుద్ధోన్మాదం ప్రపంచ మానవాళికి తీవ్ర ముప్పు
అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం ప్రపంచ శాంతికి, మానవాళికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తోందని 'ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారటీ ఆర్గనైజేషన్'(ఆప్సో) జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ హెచ్చరించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం ప్రపంచ శాంతికి, మానవాళికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తోందని 'ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారటీ ఆర్గనైజేషన్'(ఆప్సో) జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం స్థానిక వీవీ కన్వెన్షన్ హాల్ మహబూబ్ నగర్ ప్రోగ్రెసివ్ థింకర్స్ ఫోరం ఆధ్వర్యంలో 'అమెరికా సామ్రాజ్య యుద్ధోన్మాదం-పర్యావసనాలు'పై నిర్వహించిన సెమినార్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు ఖమేనీ చంపడం, పాఠశాలలపై బాంబులు వేసి పిల్లలను పొట్టను పెట్టుకోవడం సామ్రాజ్యవాద దురహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ బలం కోసం ప్రపంచ దేశాలపై దాడులు చేసి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుందని, దీని వలన ఇంధనం, గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రంపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
ఇరాన్ పై అమెరికా బాంబుల వర్షం కురిపించి 7 వేల మందిని చంపేశారని, ఇరాన్ నాగరికత లేకుండా చేస్తామని వెంటనే లొంగిపోవాలని హెచ్చరించినా, తాము చావడానికైనా సిద్ధం కానీ అమెరికాకు లొంగే ప్రసక్తేలేదని ఇరాన్ తెలిపిందని ఆయన అన్నారు. దిక్కతోయని అమెరికా ఇరాన్ లో ఉన్న బ్రిడ్జిలను కుల్చేస్తామని అమెరికా హెచ్చరిస్తే, ఆ దేశంలో ఉన్న బ్రిడ్జీల వద్ద ఇరాన్ ప్రజలందరూ మానహారంగా నిలబడి సవాల్ విసిరారని ఆయన అన్నారు. అంతేకాక అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల క్యూబా బిలియన్ల కొద్ది డాలర్ల నష్టాన్ని చవిచూసిందని, విదేశీ వాణిజ్యం, పెట్టుబడులు దెబ్బతినడంతో ఆ దేశంలో నిత్యావసరాలు, ఆహార కొరత ఏర్పడిందని అన్నారు. అంతేకాక ఇందనం, విద్యుత్ సంక్షోభం, చమురు లభించక తీవ్ర ప్రభావం చూపాయని, అప్పుడు మనదేశం వేల టన్నుల ధాన్యాన్ని క్యూబా కు పంపి ఆదుకునిందని ఆయన తెలిపారు. అమెరికా సామ్రాజ్యవాద శక్తుల కుట్రలను తిప్పి కొట్టడానికి ప్రజలంతా ఐక్యంగా నిలవాలని, ప్రపంచ శాంతిని కాపాడడానికి ప్రజాస్వామిక శక్తులు ముందుకు రావాలని అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఫోరం కన్వీనర్ బెక్కెం జనార్దన్ అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డా.మధుసూధన్ రెడ్డి, డా.రాంమోహన్, ఒబెదుల్లా కొత్వాల్, లక్ష్మణ్ గౌడ్, జగపతిరావు,కిష్టయ్య, నల్లవెల్లి కురుమూర్తి, కిల్లె గోపాల్, రామదాసు పాల్గొన్నారు.






