అమ‌ర‌గిరి స‌ర్పంచ్ గిరిలో అక్క- త‌మ్ముడి ఫైట్..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమల అడవిలో కృష్ణానది తీరం లోని అమరగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఎస్టీ జనరల్ స్థానానికి ఆదివాసీలో అక్క తమ్ముడు

అమ‌ర‌గిరి స‌ర్పంచ్ గిరిలో అక్క- త‌మ్ముడి ఫైట్..!
X

దిశ, కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమల అడవిలో కృష్ణానది తీరం లోని అమరగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఎస్టీ జనరల్ స్థానానికి ఆదివాసీలో అక్క తమ్ముడు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..? ఆ ఇద్దరు కూడా అభ్యర్థులు కాంగ్రెస్ మద్దతు తో ఒకే కుటుంబం నుంచి పోటీలో తలపడుతున్నారు. అమరగిరి గ్రామం లో మొత్తం 276 ఓట్లు, ఆరు వార్డులు ఉండగా పోటీ లో ఉన్న ఇద్దరు అక్క తమ్ముడు అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తో పోటీలో ఉన్నారు. ఆ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు. అక్క తమ్ముడు ఎన్నికల బరిలో తలపడుతుండడంతో అదే పార్టీ నాయకులు రెండు వర్గాలుగా వీడిపోయారు. సదరు నాయకులు తమ ఆధిపత్యంచాటు కోవడం కోసం ఎవ్వరికి వారు అభ్యర్థుల గెలుపు కోసం ఎత్తు కు పై ఎత్తులు వేస్తూ అంత ర్గతంగా ముందుకు వెళ్తున్నారు. సర్పంచ్ గిరి కోసం అక్కా తమ్ముడి పోటీ కొల్లాపూర్ మండలంలోనే రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పదవీ కోసం రాజకీయాల్లో రక్త సంబందికులు సైతం దూరమవుతున్నారు.


సర్పంచ్ గిరి కి అక్కతమ్ముడు మధ్య బస్తీమే సవాల్ గా మారింది. గ్రామం లో మొత్తం 276 ఓట్లున్నాయి. ఇందులో 100 ఓటర్లు ఆదివాసీలే ఉండగా.. మిగతా ఓటర్లలో యాదవులు, తెలుగు కులాలు ఉన్నారు. అమరగిరి గ్రామ పంచాయతీగా ఏర్పడిన తరువాత సర్పంచ్ గా మొదటి సారిగా బీసీ రిజర్వేషన్ కాగా రెండోసారి ఎస్టీ రిజర్వేషన్ అయింది. ఆదివాసీలకు తొలి సారిగా అవకాశం రావడం తో సర్పంచ్ గిరి కోసం అక్క తమ్ముడు కాంగ్రెస్ మద్దతుతో అభ్యర్థులుగా తలపడుతున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆశీస్సులతో సంపూర్ణ సహకారంతో గ్రామాభివృద్ధి చేస్తామని, సదరు ఇద్దరు అభ్యర్థులు అంటున్నారు. గ్రామ ప్రజలు తమను ఆశీర్వదిస్తూ గెలిపిస్తారని ఎవ్వరికి వారు ధీమా వ్యక్తం చెడ్తున్నారు. తాము సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుంటే గ్రామంలో తమే అధికారం, పెత్తనం చేయొచ్చాన్న భావనతో సదరు నాయకులు ఉన్నారు. వీరు ఆయా వర్గాల ఓటర్లను మద్దతును కూడగట్టడంలో ఎవ్వరికి వారు వ్యూహం పన్నుతూ పోటీ పడుతున్నారు.సర్పంచ్ కోసం నామినేషన్లు వేసిన అభ్యర్థులు శనివారం బరిలో నుంచి తప్పుకోవడంతో పోటీలో అక్క తమ్ముడి మధ్యే పోటీ రసవత్తరంగా మారింది.

Next Story