- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చదివిన పాఠశాలలో పూర్వ విద్యార్థిని పుట్టిన రోజు వేడుకలు
దిశ, కొల్లాపూర్ : హంగులు ఆర్బాటాలకు పోకుండా తమ జన్మదిన వేడుకలను తాను చదివిన స్కూల్ లో విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య కేక్

దిశ, కొల్లాపూర్ : హంగులు ఆర్బాటాలకు పోకుండా తమ జన్మదిన వేడుకలను తాను చదివిన స్కూల్ లో విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసి తోటి స్నేహితులకు చాక్లెట్లు పంచి, చికెన్ తో మధ్యాహ్నం భోజనం వడ్డించిన అరుదైన సంఘటన గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపూర్ ప్రాథమిక పాఠశాల లో చోటు చేసుకుంది. రామాపూర్ ప్రాథమిక పాఠశాలలో గతంలో 5వ తరగతి వరకు చదివిన పూర్వ విద్యార్థిని ఆకునమోని పవిత్ర యాదవ్ ప్రస్తుతం కొల్లాపూర్ ప్రభుత్వ గురుకుల సంక్షేమ హాస్టల్ లో పదో తరగతి చదువుకుంటోంది. విద్యార్థిని ఆకునమోని పవిత్ర యాదవ్ తన బర్త్ డే షెలబ్రేషన్ ని పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో సమక్షంలో జరుపుకున్నది. ఈ సందర్బంగా విద్యార్థిని పవిత్ర యాదవ్ మాట్లాడుతూ తాను ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుకున్న ఈ పాఠశాలలో మీ అందరితో కలిసి పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పారు. కేక్ కట్ చేసి విద్యార్థిని విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు సతీష్, క్రాంతి, పవిత్ర తండ్రి చంద్రయ్య సామాజిక కార్యకర్త. చంద్రయ్య యాదవ్ పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుంటాడు. అదే బాటలో కూతురు బర్త్ డే వేడుకలు చేశాడని అందరూ చర్చించుకోవడం విశేషం.






