స్నేహితుడి కుటుంబానికి అండగా

by Ratna Kumari |

దిశ, హన్వాడ : తోటి స్నేహితురాలు కొడుకు అనారోగ్యం తో ఉన్నాడని ఆ కుటుంబానికి అండగా నిలిచారు పదవతరగతి చదువుకున్న 2001 - 2002 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు.

స్నేహితుడి కుటుంబానికి అండగా
X

దిశ, హన్వాడ : తోటి స్నేహితురాలు కొడుకు అనారోగ్యం తో ఉన్నాడని ఆ కుటుంబానికి అండగా నిలిచారు పదవతరగతి చదువుకున్న 2001 - 2002 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు. వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూర్ గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ ​ పాఠశాలలో 2001 - 2002 సంవత్సరం లో కలిసి చదువుకున్న తమ తోటి స్నేహితురాలు జీవన్ కుమారి కుమారుడు భరత్ అనారోగ్యం తో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకుని తోటి స్నేహితురాలికి అండగా నిలవాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా స్నేహితులందరు కలిసి తమ స్నేహితురాలు జీవన్ కుమారికి 50 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు. భరత్ తొందరగా కోలుకుంటాడని తమ స్నేహితురాలు జీవన్ కుమారికి ధైర్యం చెప్పారు. పూర్వపు తోటి స్నేహితురాలికి ఆపద సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ… ఆర్థిక సాయం చేయడం గొప్పవిషయమని పూర్వపు విద్యార్థులను గ్రామస్థులు అభినందించారు.

Next Story