ప్రజావాణి కి జిల్లా అధికారులందరూ త‌ప్ప‌కుండా హాజరు కావాలి : కలెక్టర్ ఖుష్బూ గుప్తా

by Ratna Kumari |

ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే జిల్లా స్థాయి ప్రజావాణి కి జిల్లా అధికారులు కచ్చితంగా హాజరు కావాలని మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు.

ప్రజావాణి కి జిల్లా అధికారులందరూ త‌ప్ప‌కుండా హాజరు కావాలి : కలెక్టర్ ఖుష్బూ గుప్తా
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే జిల్లా స్థాయి ప్రజావాణి కి జిల్లా అధికారులు కచ్చితంగా హాజరు కావాలని మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, జెఎల్ బి హరిప్రియ లతో కలిసి ఆమె ఫిర్యాదు దారుల నుంచి 114 వినతులను స్వీకరించారు. ప్రతి అర్జీదారుని సమస్యను ఆమె సావధానంగా విని, పరిశీలించి , వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అనంతరం ప్రజావాణి నుంచి వెబెక్స్ ద్వారా మహబూబ్ నగర్ రూరల్, రాజాపూర్ మండలం తహశీల్దార్లకు, ఎంపిడిఓ, ఎంపిఓ లకు భూ సర్వే, భూ ఆక్రమణ, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నందున వాటిని క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ జరిపి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ కోర్టు కేసులకు సంబంధించి ఫైళ్లను జిల్లా న్యాయశాఖ అధికారులతో సంప్రదించి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని, లేనిపక్షంలో అధికారులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. డివిజన్ స్థాయిలో డివిజన్ లెవెల్ అధికారులు, మండల స్థాయి అధికారులు మండల స్థాయిలో జరిగే ప్రజావాణి కి హాజరుకావాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రాంరెడ్డి, జడ్పీసీఈఓ, ఇన్ చార్జి డీపీఓ వెంకట్ రెడ్డి, డీఆర్డీవో నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి పాల్గొన్నారు.

Next Story