పెబ్బేరు మున్సిపల్ చైర్మన్‌గా అక్కి శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక

by Nallavelli.Anjaneyulu |

పెబ్బేర్ మున్సిప‌ల్ చైర్మ‌న్ గా అక్కి శ్రీనివాస్ గౌడ్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. 9వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసి 141 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు.

పెబ్బేరు మున్సిపల్ చైర్మన్‌గా అక్కి శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక
X

దిశ, పెబ్బేరు: పెబ్బేర్ మున్సిప‌ల్ చైర్మ‌న్ గా అక్కి శ్రీనివాస్ గౌడ్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. 9వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసి 141 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. సోమ‌వారం చైర్మ‌న్ గా అధికార బాధ్య‌త‌లు స్వీక‌రించారు. వైస్ చైర్మ‌న్ గా సుమిత్రా రెడ్డి నియ‌మితుల‌య్యారు. రెండో వార్డు నుంచి పోటీ చేసిన ఆమె 293 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. మున్సిపాలిటీ చైర్మ‌న్ ప‌ద‌వీని బీసీల‌కు కేటాయించ‌డంతో బీసీ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. నూత‌నంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ లు ప‌ట్ట‌ణాభివృద్ధికి కృషి చేస్తామ‌ని తెలిపారు.

Next Story