- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా బుకింగ్ యాప్..ఓటీపీలు షేర్ చేయొద్దు
by velandi.Saikiran |
యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు సూచనలు చేశారు వ్యవసాయ శాఖ అధికారి ప్రియదర్శిని.

X
దిశ, వంగూరు: యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మండల రైతులకు కీలక సూచనలు చేశారు వ్యవసాయ శాఖ అధికారి ప్రియదర్శిని. యూరియా బుకింగ్ కోసం పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ నంబర్, మొబైల్‌కు వచ్చే ఓటిపి లు అవసరమవుతాయని తెలిపారు. రైతులు తమ వ్యక్తిగత వివరాలు, ముఖ్యంగా ఓటిపిలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు తెలియజేయరాదని హెచ్చరించారు. ఇతరులతో పంచుకోవడం వల్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందన్నారు. రైతులు స్వయంగా వ్యవసాయ శాఖ సిబ్బంది సహాయంతో మాత్రమే యాప్‌లో బుకింగ్ చేసుకోవా లని సూచించారు. యాప్‌లో పంట వివరాలు నమోదు చేసే సమయంలో రైతులు తాము వాస్తవంగా సాగు చేయనున్న పంటలు, వాటి విస్తీర్ణాన్ని మాత్రమే నమోదు చేయాలని పేర్కొన్నారు.
Next Story






