పండగ తర్వాతే.. మున్సిపాలిటీల రిజ‌ర్వేష‌న్లు..!

by Ratna Kumari |

మున్సిపాలిటీల రిజర్వేషన్లు సంక్రాంతి పండగ తర్వాతే ఉండవచ్చు అని అధికారులు అంటున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు ఇది జాబితాను అధికారులు ప్రకటించారు.

పండగ తర్వాతే.. మున్సిపాలిటీల రిజ‌ర్వేష‌న్లు..!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : మున్సిపాలిటీల రిజర్వేషన్లు సంక్రాంతి పండగ తర్వాతే ఉండవచ్చు అని అధికారులు అంటున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు ఇది జాబితాను అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోటీ చేయాలి అన్న ఆలోచనలలో ఉన్న ఆశావాహులతో పాటు.. ముఖ్య నాయకులు.. కార్యకర్తలు తమ దృష్టిని రిజర్వేషన్ల వైపు సారించారు. రిజర్వేషన్లు ఏ క్షణానైనా ఖరారు కావచ్చు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆశావాహులంతా రిజర్వేషన్ల అంశంపై ఆరా తీస్తున్నారు. అధికారులు రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను సిద్ధంగా ఉంచుకున్నారు. ఉన్నత అధికారులు ఏ క్షణాన ఆదేశించిన రిజర్వేషన్లను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా సంక్రాంతి తర్వాతే రిజర్వేషన్ల ఖరారు.. ఆ తర్వాత షెడ్యూలు విడుదలయ్య అవకాశాలు ఉన్నాయి అని అధికారులు అంటున్నారు.

ఆశావాహులలో ఉత్కంఠ..

ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే ఆలోచనలలో ఉన్న వారిలో ఉత్కంఠ నెలకొన్నది. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల రిజర్వేషన్లను బట్టి తమకు పోటీ చేసే అవకాశం లభిస్తుందా.. లేదా..!? అన్న అంశాలపై జోరుగా చర్చలు జరుపుతున్నారు. కొంతమంది ఆశావాహులు రిజర్వేషన్లు తమకు అనుకూలంగా ఉండే విధంగా చూడాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుకున్నట్లు సమాచారం. తమ చేతిలో ఏమీ లేదు అని జనాభా ప్రాతిపదికన అధికారులే రిజర్వేషన్లు ఖరారు చేస్తారు అని ఎమ్మెల్యేలు చెబుతున్నట్లు తెలుస్తోంది.

Next Story